8 May, 2026 | 8:12 AM

నేడు జనగణన 2027 వాక్

08-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా 

మహబూబ్ నగర్ మే 7 (విజయ క్రాంతి) : జన గణన 2027 లో బాగంగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు  మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో స్టేడియం గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వాక్  నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.ఈ వాక్ లో విద్యార్థులు,యువత,ప్రజలు అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు జనగణన 2027 లో బాగంగా మొదటి దశలో స్వీయ గణన  ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన కు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

స్వీయ గణన లో ప్రతి ఒక్కరు పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తర్వాత ఎన్యూమరేటర్ ఇంటింటికి పోయి మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా ఇండ్ల గణన  నిర్వహించనున్నట్లు తెలిపారు. జన గణన 2027 పై అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ పాల్గొని వివరాలు నమోదు చేసుకునేలా చార్జి అధికారులు మున్సిపల్ కమిషన్ లు తహశీల్దార్ లు గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా చెత్త సేకరణ రిక్షాల ద్వారా  పాటలు ప్లే చేసి అవగాహన కలిగించాలని కలెక్టర్ కోరారు.