16 August, 2026 | 4:44 AM

పాతబస్తీపై చెరగని ముద్ర టైగర్ ఆలె నరేంద్ర!

16-08-2026 12:00 AM
  1. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
  2. తెలంగాణ ఆకాంక్షలకు బలమైన స్వరం
  3. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తనదైన మార్క్
  4. 20న ఆలె నరేంద్ర జయంతి  

హైదరాబాద్, ఆగస్టు 1౫ (విజయక్రాం తి): ‘టైగర్’ నరేంద్ర.. ఒక పేరు కాదు, ఓ పో రాట స్ఫూర్తి. తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రజా సమస్యలపై నిర్భయంగా స్పందించిన నాయకుల్లో ఆలె నరేంద్రది ప్రత్యేక స్థానం. సాధారణ పద్మశాలి కుటుంబంలో జన్మించిన నరేంద్ర.. దాదాపు ఐదు దశాబ్దాల రాజ కీయ ప్రయాణంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తాను నమ్మిన లక్ష్యాల కోసం నిరంత ర పోరాటం చేశారు. 1946లో హైదరాబాద్‌లో ఆలె రామలింగం  పుష్పవతి దం పతులకు ఆలె నరేంద్ర జన్మించారు.

హైదరాబాద్ పాతబస్తీ రాజకీయ వాతావరణం ఆయన వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిది ద్దింది. ప్రజలతో నేరుగా మమేకం కావడం, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, అన్యాయంగా భావించిన అంశాలపై ధైర్యం గా స్పందించడం ఆయన శైలిగా మారింది. ఆ ధైర్యసాహసాలే ప్రజల హృదయాల్లో ఆ యనకు ‘టైగర్ నరేంద్ర’ అనే ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. 

స్వరాష్ట్ర సాధనకోసం ప్రత్యేక రాజకీయ ప్రయాణం

హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల నుంచి ఎదిగిన నరేంద్ర.. జనసంఘ్, బీజేపీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధన సమితి (టీఎస్‌ఎస్) పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఐక్యంగా, విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం తో తెలంగాణ సాధన సమితిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో విలీనం చేశారు. రాజకీయ పదవుల కంటే తాను నమ్మిన ప్రజా లక్ష్యాలే ముఖ్యమైనవిగా భావించిన గొప్ప నాయకుడు ఆలె నరేంద్ర.

ఈనెల 20న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో ఆలె నరేంద్ర జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ‘మన ఆలోచన సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్‌రావు తెలిపారు. నరేంద్ర అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.