calender_icon.png 9 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి సేవచేసే వ్యక్తులు గంగపుత్రులు

09-02-2026 01:03:47 AM

గంగపుత్ర సంఘం డైరీ ఆవిష్కరణ సభలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): గంగా నది ఎంత పవిత్రమో,   గం గపుత్రులు కూడా అంతే పవిత్రులని, వారు సమాజానికి సేవచేసే గొప్ప వ్యక్తులని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నా రు. విద్యతోనే గౌరవం, కీర్తి దక్కుతాయని అన్నా రు. తెలంగాణ గంగపుత్ర సంఘం డ్బ్బు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026- నూతన సంవత్సర డైరీ ఆయన రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గంగపుత్ర చిన్నారులందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంగపుత్రుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నరసయ్య, సంగం ఉపాధ్యక్షుడు గుడి బోయిన శివరత్నం, ప్రధాన కార్యదర్శి చంద్ర ప్రకాష్, ఓం ప్రకా ష్, డైరీ కమిటీ కన్వీనర్ కంటే రామచందర్,  ఎర్రబోయిన మల్లేష్ పాల్గొన్నారు.