calender_icon.png 6 February, 2026 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బగలాముఖీ అమ్మవారికి పల్లకిసేవ

06-02-2026 07:11:17 PM

శివ్వంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా  అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో, బగలాముఖీ ట్రస్టు సభ్యుల సహకారంతో భక్తుల ఆనందోత్సవాల మధ్య శుక్రవారం బగలాముఖీ అమ్మవారికి పల్లకిసేవను నిర్వహించడం జరిగింది. భక్తుల జయజయ ధ్వనుల మధ్య నిర్వహించిన పల్లకిసేవలో బగలాముఖీ ట్రస్టు చైర్మన్ వెంకటేశ్వర శర్మ దంపతులతో పాటు శక్తిపీఠం స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, పత్రాల శ్రీనివాస్ గౌడ్, దేవదత్తు శర్మ, వెంకన్న శర్మ పల్లకిమోసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు హంసాన్ పల్లి నర్సింహా రెడ్డి,మొలుగు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.