2 September, 2026 | 10:23 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

నన్ను పక్కన పెట్టేశారు!

17-08-2026 | 12:00am

బతకడానికి పనికిరాడని పక్కన పెట్టేశారు నేను ఎక్కడికి ఆలస్యం చేయను తొందరగా వెళ్లాలన్న, హడావుడిలో ఆలస్యమవుతుందని, తొందర పడతాను ముందుగానే, తయారై కూర్చుంటాను ఆలోచనల రద్దీలో, అలారం వినిపించదు !

నా చేతిలో అనార్లు, ఆపిల్ పళ్లు చూసి ఎక్కడో దావత్‌కు, వెళ్లొస్తున్నా ననుకోకండీ ఆలస్యానికి కారణం, అదికాదు కూలిపోయిన వంతెన దగ్గర ఆటో ఎక్కాను పళ్లమ్ముకొనే ముసలాయన సైకిల్ పడిపోతే బాధ చూడలేక, నాలుగు పళ్లు కొన్నాను !

నేను ఇంట్లో బిజీగా వుంటానంటే, చినిగిన పుస్తకాలు అతికిస్తూ దినమంతా కూర్చుంటాననుకొంటారు పగిలిన గుండెను కుట్టుకోవడానికే, సమయం సరిపోదు. పేజీలకోసం, గమ్మూ, టేపూ ఎక్కడ వెతుకుతాను! 

చిన్నప్పటినుండే మనుషుల్ని ప్రేమించడానికి అలవాటు పడ్డాను అందుకే నన్ను, బతకటానికి పనికి రాడని, పక్కన పెట్టేశారు !ఇక్కడ, నేను ఎట్లా వుండాలో ఊహించుకొని, అట్లా వుండడానికి, చాలా సమయం పట్టింది ఎవరైనా నన్ను గుర్తు పడతారో లేదో తెలియదు నేను అందర్నీ గుర్తుపెట్టుకున్నాను !!