8 April, 2026 | 4:17 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

నిలువ నీడ చూపారు..చిరస్థాయిగా నిలిచారు!

04-01-2026 12:00 AM
  1. మానుకోటలో కాలనీ, వీధులకు నేతల పేర్లు 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి  

సాధారణంగా పట్టణాల్లోని వీధులకు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్వతంత్ర సమరయోధుల పేర్లు, లేదంటే విశేషంగా ప్రజాసేవకు అంకితమైన వారి పేర్లు పెట్టడం సర్వసాధారణం. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఇందుకు భిన్నంగా తమకు నిలువ నీడ కల్పించిన వారిని నిరంతరం గుర్తుంచుకునే విధంగా వారి పేర్లను  కాలనీలు, వీధులకు పెట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

వందల మందికి ఇళ్ల స్థలాలు

మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడక ముందు తాలూకా, మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వివిధ పార్టీల నాయకులు పేదలకు ప్రభుత్వ స్థలాల్లో నిలువ నీడ కల్పించే విధంగా కృషి చేశారు. ఇదే కోవకు చెందిన సీపీఎం నేత ఆకుల లక్ష్మయ్య, సీపీఐ నేత బ్రాహ్మణపల్లి ధర్మయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య మానుకోటలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, పలు చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేశారు. వీరి కృషి వల్ల వందల మందికి మానుకోట పట్టణంలో పలుచోట్ల నిలువ నీడ దక్కింది. వారి కృషికి గుర్తుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో  కాలనీలు, వీధులకు వారి పేర్లను నిర్ణయించి, నిరంతరం గుర్తుంచుకునే విధంగా నేమ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం.

 బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి