సిలిండర్ ధర పెంచి క్రూరత్వాన్ని చాటారు
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వాణిజ్య సిలిండర్ ధర ను రూ. 1000 వరకు పెంచిన కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై తన క్రూరత్వాన్ని చాటుకుందని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. దేశంకోసం, ధర్మంకోసం ప్రతినిత్యం నీతి సూత్రాలు చెప్పే బీజేపీ నాయకులు ఇప్పుడు దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ఎన్నికలు, కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ దేశ ప్రజల సమస్యలపై లేదనేది మరోసారని స్పష్టమైందన్నారు.
కేంద్రప్రభుత్వ చర్యల వల్ల దాదాపు 145 కోట్ల మంది ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం పడుతోందన్నారు. ఇప్పటికే బల్క్‌డీజిల్ వినియోగించే సంస్థలపై అదనం గా లీటర్‌కు రూ. 12 వరకు ధరలు పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నారని తెలి పారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చెప్పినట్లే ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెంచ డం ద్వారా కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం బయటపడిందని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని సుధాకర్‌గౌడ్ మండిపడ్డారు.






