23 June, 2026 | 4:01 AM

వ్యవసాయ బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ

23-06-2026 12:00 AM

కొమరవెల్లి, జూన్ 22: వ్యవసాయ బావుల వద్ద పంపుసెట్ల కేబుల్ వైర్లు దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన కిష్టంపేట గౌరపల్లి కొమరవెల్లి గ్రామాలలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొమరవెల్లి, కిష్టంపేట, గౌరాయపల్లి మూడు గ్రామాల సరిహద్దుల్లో 17 మంది రైతుల బోరు బావుల మోటర్ రా కేబుల్ వైర్లను కట్ చేసుకుని గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. నెలరోజుల వ్యవధిలోనే రెండుసార్లు చోరీకి పాల్పడడం గమనర్హం.

వరుస దొంగతనాలు జరగడంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వ్యవసాయ సీజన్లో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల పొలం పనులకు అంతరాయం కలుగుతుందని, విలువైన కేబుల్ వైర్లను తిరిగి అమర్చుకోవాలంటే రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు నిఘా పెంచి, చోరీకీ పాల్పడే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు.