23 June, 2026 | 5:05 AM

బాలల భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించాలి

23-06-2026 12:00 AM

తాడ్వాయి, జూన్, 22( విజయ క్రాంతి ): బాలల భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించాలని నందివాడ గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య  తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో సోమవారం బాల గ్రామసభ, మహిళా గ్రామ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల భవిష్యత్తు పై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతేనే సమాజం బాగుపడుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధురి, సుధాకర్ రావు, వి డి సి అధ్యక్షులు కంకణాల బాలచంద్రం, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.