21 July, 2026 | 7:48 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

20-07-2026 01:45 AM
  1. వచ్చే నెలలో నకిరేకల్ పట్టణాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి
  2. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల (నకిరేకల్) జూలై 19 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని,  ప్రజల సంక్షేమమే  ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 02, 03, 04, 12, 13, 14 వార్డులకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

వచ్చే నెలలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నకిరేకల్ పట్టణాన్ని సందర్శించనున్నారని తెలిపారు. అలాగే నకిరేకల్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం సంతోషకర విషయమని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.