నృసింహస్వామి మాలధారణకు వేళాయే
- నేటి నుంచి 41 రోజులపాటు దీక్షలు
స్వామి వారి జయంతి రోజు విరమణ
యాదగిరిగుట్ట, మార్చి 19 : శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మాలధారణ (దీక్ష) భక్తు లు స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి, వారి అనుగ్రహం పొందడానికి మాలలు వేస్తుంటారు. ఈ పవిత్రమైన మా ల వేసిన స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలను ఆచరిస్తుంటారు. సాధారణం గా భక్త ప్రహ్లాదుడి కథ, హిరణ్యకశిపుని సంహారం, నవ నరసింహ క్షేత్రాల మహత్యంలను మాలధారణ సమయంలో తెలుసు కుంటుంటారు.
ఇవీ మాలధారణ నియమాలు..
గురువు లేదా అర్చకుల ద్వారా మాల ధ రించాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేసి నరసింహ స్తోత్రాలు, ‘ఓం నమో నరసింహాయ. అష్టోత్తరం జపించడం, ముఖ్యంగా ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వ లంతం సర్వతో ముఖం నృసింహ్మం భీష ణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహమ్’ మంత్రాన్ని స్వాములు పటిస్తుం టారు. అలాగే సాత్విక ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటించడం ప్రధాన నియమాలు.
41 రోజుల తర్వాత మాల విరమణ..
నరసింహ స్వామి ఆలయంలో లేదా నది ఒడ్డున మాలవిరమణ చేస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో నరసింహస్వా మి మాలవేసే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాలాధారణ వేసే భక్తులు ఈనెల 20 నుంచి ఏప్రిల్ 30 స్వామి జ యంతి రోజున మాల విరమణ చేస్తారు. ఇప్పటికే స్థానిక భక్తులు, పరిసర ప్రాంతాల భక్తులు మాలాధారణ వేసేందుకు సిద్ధమయ్యారు. నరసింహ మాల ధారణ వేస్తే గ్రహ, గృహ దోషాలు తొలుగుతాయని, కష్టాల కడలిలో నుంచి ఆనందకర జీవితం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మొదలైంది ఇలా..
తొలిసారిగా 2007వ సంవత్సరంలో గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆరే రామచందర్ గౌడ్ నరసింహ స్వామి మాల వేసుకొని విస్తృత ప్రచారం చేశారు. తదుపరి 2008లో అప్పటి ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ 120 నుండి 150 మంది భక్తులతో కలసి నరసింహస్వామి మాల వేశారు. అప్పట్లో దేవస్థానం కొండపైననే 150 మందికి అన్ని సౌకర్యాలు వసతి, భోజనము, అల్పాహారం కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బూడి ద బిక్షమయ్య గౌడ్ స్వామి వారి మాలలోనే ప్రతిరోజు గిరిప్రదక్షిణ చేసేవారు.
అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానంలో దర్శనము, సైదాపు రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కూడా బూడిద బిక్షమయ్య గౌడ్ మాలలోనే ఉండడం గమనార్హం. నరసింహస్వామి మాలాధారణను విస్తృత ప్రచారం చేయడంలో బూడిద బిక్షమయ్యగౌడ్‌ది కీలకపాత్ర. తరువాత నరసింహ స్వామి మాల వేసే భక్తులకు దేవస్థానం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు.
ఎమ్మెల్యే చొరవతో పునర్ వైభవం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి పునర్నిర్మానంలో కొన్ని ఇబ్బందులలో మాల ధారణ భక్తులు తగ్గారు. తదుపరి కెసిఆర్ గిరిప్రదక్షిణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత పది పన్నెండు సంవత్సరాల నుండి 100 లోపు భక్తులు నరసింహ మాలదరణ వచేసుకుంటున్నా దేవస్థానం వారు వారిని పట్టించుకోకపోవడం గమనించదగ్గ విష యం.
అనంతరం మాలధారణ స్వాములు అందరూ కలసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన దేవస్థానం ఈవో భాస్కర్ రావుతో మాట్లాడి వారికి వసతి, భోజనం కల్పించాలని చెప్పడంతో వెంటనే వారికి కొండ కింద తులసి కాలేజిలో రూ మును ఏర్పాటు చేశారు. అలాగే నిత్య అన్నదాన సత్రంలో భోజనం ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అనుసరించనున్నారు.
స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించాలి..
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాలధారణ స్వాములు 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మాల వేసుకున్న స్వాములకు అభిషేకంతో పాటు స్వామివారి దర్శనం కో సం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అలాగే మాలాధారణపై దేవస్థానం అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలి. అదేవిధంగా దేవస్థానం వసతి, భోజ నం, ఉదయం, సాయంత్రం అర్చన దర్శనాలకు అవకాశం కల్పించాలి.
సత్తిరెడ్డి, గురుస్వామి




