16 June, 2026 | 2:40 AM

21 నుంచి టీజీ20 లీగ్

16-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణలో యువక్రికెటర్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న టీజీ 20 క్రికెట్ లీగ్ జూన్ 21 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను హెచ్‌సీ ఏ విడుదల చేసింది. జులై 10న జరిగే ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు కూడా ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో పాలమూరు స్ట్రైకర్స్,- అన్విత ఖ మ్మం ఏస్ జట్లు తలపడనున్నాయి.

రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగిలిన ఏడు టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. లీగ్ దశ పా యింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానా ల్లో ఉన్న జట్లు తొలి ఎలిమిటర్ మ్యాచ్ ఆడతాయి. దీనిలో ఓడిపోయిన జట్టు నిష్క్రమి స్తుంది. ఆ తర్వాత పట్టికలో తొలి రెండు స్థా నాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో ఎలిమినేటర్ జరుగుతుంది. గెలిచిన టీమ్ నే రుగా ఫై నల్ చేరనుండగా.. ఓడిన జట్టు, తొలి ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో పోటీ పడుతుం ది. గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.