తుమ్మచెరువు నుంచి హౌసింగ్ బోర్డు వరకు రోడ్డు వేయాలి
మేడ్చల్ డివిజన్ బిజెపి అధ్యక్షురాలు: జల్లి శైలజ హరినాథ్
మేడ్చల్ అర్బన్ జూన్ 15(విజయక్రాం తి): మేడ్చల్ తుమ్మ చెరువు నుండి హౌసింగ్ బోర్డు,లైబ్రరీ వరకు నూతన రోడ్డు నిర్మాణం కోసం మేడ్చల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు వినతి పత్రం అందజే సినట్లు మేడ్చల్ మున్సిపల్ డివిజన్ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మ చెరువును పూర్తి స్థాయిలో అభివ్రుద్ది చేసి భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు విజ్ఞప్తి చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.అంతే కాకుండా తుమ్మ చెరువులో పూడిక తీయిస్తే భూగర్గ జలాలు పెరిగే అవకాశం ఉందని అలాగే డ్రైనేజీ కలవకుండా చూడాలని నూతన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలను శైలజ హరినాథ్ వెల్లడించారు.
అదేవిధంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రధాన రోడ్డు హౌసింగ్ బోర్డు నుండి లైబ్రరీ వరకు తక్షణమే కొత్త రోడ్డును వేయాలని ఆమే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రిక లక్ష్మణ్.పాతూరి సుధాకర్ రెడ్డి.బీజేవైఎం జిల్లా నాయకులు బొజ్జ రాఘవరెడ్డి.మున్సిపల్ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్.కానుకంటి వంశీ విజయ్.మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షులు మైసరి రాజు.బి సర్వేశ్వర్ రెడ్డి.కార్యదర్శులు సురేందర్ రెడ్డి.విష్ణు కార్యవర్గ సభ్యులు శ్రీ పాల్.చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్.మహేష్ గౌలికర్.బొజ్జ వంశీ రెడ్డి.మామిళ్ళ నర్సింగ్ రావు.ఎన్‌ఎస్ గౌడ్. బాబుగౌడ్. పురుషోత్తం పాల్గొన్నారు.






