16 June, 2026 | 3:50 AM

హోరాహోరీగా టీ9 చాలెంజ్ గోల్ఫ్

16-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 15: టీ గోల్ఫ్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ9 ఛాలెం జ్ నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోం ది. గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ వేదికగా ముగిసిన రెండో రౌండ్ల్ టీమ్ దాసోస్ ఆధిపత్యం కనబరిచింది. 4.5 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా పూల్ ఏలో బంకర్ బస్టర్స్, పార్ టైమర్స్ 5.5 పాయింట్ల చొప్పున ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

8 మ్యాచ్‌లు ముగిసేసరికి బంకర్ బస్టర్స్ అగ్రస్థానంలో నిలిచింది. దాసోస్ బై మహి 4.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. విసాఫ్ట్ టైటాన్స్ (3.5 పాయింట్లు), శ్రీమెట్రిక్స్ ఈగల్స్(3 పాయింటు)్ల, రాజపుష్ప ఇన్విక్టా(2 పాయింట్లు) సాధించాయి. అటు పూల్ బిలో అర్డీ ఐరన్ ఈగల్స్ , జాగృతి జాగ్వర్స్ ఐదేసి పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్ (4.5) మూడో స్థానంలోనూ, హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్(3.5 పాయిం ట్లు), ఫెయిర్‌వే వారియర్స్, నోవాటెల్ స్టార్స్ మూడేసి పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

టీ20 ఫార్మాట్ తరహాలో టీగోల్ఫ్ ఫౌండేషన్ టీ0 ఛాలెంజర్ టీమ్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోం ది. జూన్ 27 వరకూ ఈ టోర్నీ జరగనుండగా..మొత్తం 12 జట్ల నుంచి 108 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారు. గోల్ఫ్‌ను ప్రమో ట్ చేసే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో టీ9 ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని టీగోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు.