28 August, 2026 | 9:27 AM

పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో నూతన టాయిలెట్ బ్లాక్ నిర్మాణం

27-08-2026 09:50 PM

భూమిపూజ చేసి ముగ్గు పోసిన సర్పంచ్ చిందం మహేష్

మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవకు గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల కృతజ్ఞతలు

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం పన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధుల ద్వారా పన్నూర్ గ్రామంలోని MPPS ఉప్పర్ల కేశారం పాఠశాలలో నూతన టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.4 లక్షలు మంజూరయ్యాయి. ​తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో పన్నూర్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు మంజరు కావడం పట్ల గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

​ఈ సందర్భంగా గురువారం నూతన టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ చిందం మహేష్ ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. గ్రామంలోని విద్యా సంస్థల అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్న మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడి, విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.