7 March, 2026 | 2:38 PM

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

07-03-2026 12:38 PM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం అసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుబ్రంగా ఉంచాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. శనివారం దహేగాం మండలంలోని ఐనం మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలను కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, టాయిలెట్లు, తరగతి గదులను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను వారంలో ఒక సారి గ్రామ పంచాయతి మల్టీ పర్పస్ కార్మికులచే శుభ్రం చేయించాలని కలెక్టర్ అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త కుండీలలో వేయాలన్నారు. టాయిలెట్ గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన బోదనతో పాటు మెను ప్రకారం మద్యహ్న భోజనం అందించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్ధుల ఆరోగ్యం పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరచుగా పాఠశాలకు రాని విద్యార్ధులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలో అనేక మౌళిక వసతులు కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.ఈ కార్యక్రమములో ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.