శ్రీ భీమేశ్వరస్వామి సేవలో రాజం దంపతులు
03-03-2026 12:47 AM
- ఆలయ అర్చకుల వేదోక్త ఆశీర్వచనం
- శేషవస్త్రాలు, లడ్డూప్రసాదం అందజేత
వేములవాడ, మార్చి 2 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం దం పతులు సోమవారం వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, కండువాలతో సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.




