10 May, 2026 | 1:15 AM

ప్రేమలు జోడీ రిపీట్

10-05-2026 12:07 AM

మలయాళ సెన్సేషన్ మమిత బైజు, సంగీత్ ప్ర తాప్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొ చ్చేది ‘ప్రేమలు’. 2024లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రంతో వీరిద్దరూ యూత్ ఐకాన్‌గా మారిపోయారు. ఈ జోడీ మరోమారు తెరపై సందడి చేయనుంది. దినోయ్ పౌలోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆషిన్ ఉస్తాన్ నిర్మాణ సంస్థ నిర్మి స్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తిచేసిన టీమ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించనుంది.

ఈ విషయాన్ని మమిత బైజు తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ప్రేమలు’ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతో అటు మమిత అభిమా నులు, ఇటు మలయాళ సినీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మమిత గ్లామర్, సంగీత్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు కలిసి రానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.