20 May, 2026 | 2:39 AM

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి

20-05-2026 12:00 AM

ఎన్‌ఫోర్స్ మెంట్ సివిల్ సప్లై డీఎస్పీ రమేష్ 

ఆమనగల్లు, మే19, (విజయకాంతి): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని  ఎన్ ఫోర్స్ మెంట్  సివిల్ సప్లయ్ డీఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులో వారి కొనుగోలు కేంద్రాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ సివిల్ సప్లై డీఎస్పీ రమేష్ జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ ఆవరణలో రైతులకు ఎనమిది మిషన్స్ కలవని, రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు పదివేల క్వింటాళ్ల ధాన్యాన్ని తరలించినట్లు, ధాన్యం తరలింపులో లారీల సమస్య ఉండవద్దని కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు తాళ్ల రవీందర్, రమేష్, సంపత్, నరేష్ నాయక్, పీఏసీఎస్ సీఈవో దేవేందర్, మెకానిక్ బాబా,శీను తదితరులు పాల్గొన్నారు.