2 March, 2026 | 5:17 AM

కొడంగల్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి

02-03-2026 01:53 AM
  1. రాబోయే వేసవి కాలంలో త్రాగు నీటి సమస్యలు ఉండకూడదు

జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి 

కొడంగల్, మార్చి -1 కొడంగల్ నియోజకవర్గం లో మంజూరు అయిన నిర్మాణ ప నులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ దీపక్ తివా రి ఆదేశించారు.ఆదివారం   కడా కార్యాలయంలో కొడంగల్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు సంబందించి సంబంధిత శాఖల అధికారులతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సమీక్ష సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... కొడంగల్ మరియు నారాయణ పేటకు సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు, ఎలక్ట్రిసిటీ, త్రాగు నీ రు, బగీరథ మిషన్ పైపు లైన్ లు, పంచాయతీ రాజ్ మరియు ఆర్ అండ్ బి, టి జి ఇ డబ్ల్యఐ డి సి,పబ్లిక్ హెల్త్ శాఖ ల ద్వారా ఇ ప్పటికే మంజూరైన వివిధ నిర్మాణ పనులు ప్రారంభించిన వాటిని, పూర్తి అయిన పనులను అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేసి ల క్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఇ డబ్యూ ఐ డి సి ద్వారా మంజూరు అ యి మొదలు పెట్టిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలనీ, అన్ని శాఖ ల సమన్వయ తో పని చేయాలనీ అధికారులకు సూ చించారు. ఎండా కాలం లో త్రాగు నీటి స మస్య రాకుండా చూడాలని,ఏదైనా సమస్య ఎదురైతే మా ద్రుష్టి కు తీసుకు రావాలని, ఆర్ అండ్ బి ద్వారా చేపట్టే పనులను వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించిన పనులను త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేసే పనిలో ప్రోగ్రెస్ ఉండాలని, నిర్మాణ ప నులకు సంబంధించిన ఫోటోలు పంపించాలని సూచించారు.

అనంతరం టి జి ఇ డబ్ల యు ఐ డిసి ద్వారా చేపట్టిననిర్మాణ పనులు, దుద్యాల మండలానికి సంబందించిన ఇంటిగ్రెటెడ్ బిల్డింగ్స్ నిర్మాణ పనులను హకీంపేట్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి,ఎడ్యుకేషన్ హాబ్ నిర్మాణం యొక్క ప్లాన్ ను పరిశీలించారు.జరుగుతున్న ప్రతి పనికి సంబందించిన పనులు జరుగుతున్న క్రమం లో ఏవైనా సమస్య లు ఎదురైతే మా ద్రుష్టి కి తీసుకురావాలన్నారు.

ముఖ్యoగా వేసవి కాలం ఉన్నందున త్రాగునీటీ సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ముందుగా కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి వివిధ అభివృద్ధి పను ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సమావేశంలో ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి,కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పంచాయతి రాజ్ డి ఇ ,సుదర్శన్,ఆర్ అండ్ బి ఇ ఇ శ్రీధర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ ఎస్ ఇ రవి ప్రసాద్,ఈడబ్ల్యూఐడిసి ఇఇ, కొడంగల్, నారాయణ పేట్ సంబందించిన ఇంజినీరింగ్ విభాగం ఇఇ, డిఇలు సంబంధిత అధికారులు,తదితరలు పాల్గొన్నారు.