18 May, 2026 | 10:03 AM

నూతన కమిటీలు ఉత్సాహంతో పని చేయాలి

18-05-2026 12:00 AM

పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ 

సికింద్రాబాద్, సనత్‌నగర్, మే 17 (విజయక్రాంతి): సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నూతనోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.

సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడిగా అబ్బాస్ షరీఫ్, బికేగూడ అధ్యక్షుడిగా రవికాంత్, ఎస్సార్‌నగర్ డివిజన్ అధ్యక్షుడిగా దేవులపల్లి రవికిరణ్, అమీర్‌పేట్ అధ్యక్షుడిగా శ్రీకాంత్‌యాదవ్, బేగంపేట్ అధ్యక్షుడిగా మహమ్మద్ నసీర్, రాంగోపాల్‌పేట్ అధ్యక్షుడిగా త్రికాల మనోజ్‌కుమార్, పద్మారావునగర్ అధ్యక్షుడిగా జగదీశ్, బన్సీలాల్‌పేట్ అధ్యక్షుడిగా రమేష్ బాబు నియమితులయ్యారు.

వీరంతా కోట నీలిమను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈమెతోపాటు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్‌కు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన 8 మంది అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నూతన కమిటీలపై ఉందన్నారు.