అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలి
మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి, జూలై 2 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి లోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని జక్క వెంకట్ రెడ్డి అధికారులతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలతో పరిశీలిస్తూ బి ఎల్ ఓ లు, బి ఎల్ ఎ లతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా, అలాంటి తప్పులకు తావు లేకుండా, వేగవంతంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు, బూత్ స్థాయి సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొల్తూరి మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షుడు ప్రభు, మైనార్టీ అధ్యక్షుడు జిలాని పాషా, నాయకులు ఆకుల మధుకర్, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, వీరమళ్ళ జగన్నాధం, నర్సిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శంకర్ గౌడ్, చిందం రమేష్, శ్యామల రమేష్తో పాటు బి ఎల్ ఓ లు, బి ఎల్ ఎ లు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






