3 July, 2026 | 3:27 AM

కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్

03-07-2026 12:03 AM

పార్టీ కండువా కప్పిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్ గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వారికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు.

ఈ సందర్భంగా ఉప్పల్ వాయి సర్పంచ్ శివాని రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, ఉపాల్వాయి గ్రామం కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం వంటి అనేక ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో తాము సమిష్టిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.