1 April, 2026 | 5:00 AM

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

01-04-2026 12:00 AM

ములకలపల్లి, మార్చి 31 (విజయక్రాంతి): ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి,సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రము లోని సిఐటియు ఆధ్వర్యంలో తాహశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తాహశీల్ధార్ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 28న హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వేళ్తున్న ఆశా వర్కర్లలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి అక్కడ ఆశా వర్కర్ల పై పోలీసులు అరెస్టు చేసి కేసులు బనాయించి పోలీసు స్టేషన్ లలో నిర్బంధించా రని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పోరాటాన్ని అణిచి వేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ అరెస్టుల తో ఆశా వర్కర్ల పోరాటాలు ఆపలేరని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్ల కు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ మండల అధ్యక్షురాలు నల్లి సూజాత, లాలుబీ, కోడిమే ఇందిరా,కురం నాగలక్ష్మి, మాణిక్యమ్మ, మీనా, పావని, భారతి, పద్మ, లలిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.