1 April, 2026 | 3:11 AM

భీమలింగేశ్వర ఆలయంలో పుస్తకావిష్కరణ

01-04-2026 12:00 AM

కల్వకుర్తి మార్చి 31 : కల్వకుర్తి పట్టణంలోని శ్రీ భీమలింగేశ్వర ఆలయంలో మంగళ వారం భక్తకవి కర్నాటి రఘు రాములు రచించిన రఘురామ దాస భజన కీర్తనలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథంలో ఆధ్యాత్మికతతో నిండిన భజన కీర్తనలకు ప్రాధాన్యమివ్వగాఇప్పటి వరకు 30 పుస్తకాలను ముద్రించినట్లు తెలిపారు.

కల్వకుర్తి ప్రాంతానికి చెందిన మురళీధర్ రెడ్డి తమ తల్లిదండ్రుల స్మారకార్థంగా పుస్తక ముద్రణకు ఆర్థిక సహాయం అందించారని ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి మంచికి దారి చూపడం ఈ గ్రంథం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు రచయితను శాలువాతో సన్మానించారు. వారి తో పాటు రాజు, కృష్ణారెడ్డి, రాధాకృష్ణ, శ్రీనివాసులు, అంజిరెడ్డి, కర్ణాకర్, గజ్జలయ్య, స త్యం, మల్లేష్, రమేష్, లింగం, శ్రీశైలం, భజ న బృంద సభ్యులుతదితరులు పాల్గొన్నారు.