11 April, 2026 | 1:55 AM

డిస్ట్రిబ్యూటర్ల సంతోషమే నిజమైన విజయం

11-04-2026 12:03 AM

జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్‌కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. మానసశర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేశారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు మేకర్స్ మంచి నిర్ణయం తీసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో ఈ మూవీ టికెట్ ధరను రూ.100గా నిర్ణయించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి హైదరాబాద్‌లో శుక్రవారం బ్లాక్‌బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, నిర్మాత వై రవిశంకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైత్రి రవి మాట్లాడుతూ.. ‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం.

ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం. మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వేసవిలో చల్లగాలిలా ఆహ్లాదం పంచే చిత్రమిది” అన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “సినిమా మీద పిచ్చి, ప్రేమతో డిస్ట్రిబ్యూటర్లు చిత్రాల్ని కొంటారు. సినిమా ఫలితం మొదట ప్రభావం డిస్ట్రిబ్యూటర్ల మీదే పడుతుంది. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే సినిమా హిట్టయినట్టు.

‘రాకాస’ను నమ్మి తీసు కున్న ప్రతీ డిస్ట్రిబ్యూటర్‌కూ థాంక్స్‌” అని చెప్పారు. దర్శకురాలు మా నసశర్మ మాట్లాడుతూ.. “మా ‘రాకాస’ మూవీని డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి జనం వద్దకు చేర్చారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు” అని తెలిపారు. నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. “మా డిస్ట్రిబ్యూ టర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజ యం అని నాకు అనిపిస్తోంది.

నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేశ్, డిస్ట్రిబ్యూటర్లు సన్నీ, భాస్కర్, రమేశ్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు.