23 June, 2026 | 10:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

23-06-2026 12:00 AM

గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారు జోడు రాంబాబు 

జనగామ, జూన్ 22 (విజయక్రాంతి): ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని.. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కడియం శ్రీహరి తో సాధ్యమని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు.

సోమవారం రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో కెనాల్ పనులను సందర్శించి పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఫోన్ చేయడం జరిగిందన్నారు వెంటనే స్పందించిన కాంట్రాక్టర్ సూపర్వైజర్ ని పంపించారు. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన వివరించారు.

సూపర్వైజర్ ధనుంజయ అక్కడికి వచ్చి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా  రాంబా బు మాట్లాడుతూ.. పతి ఎకరం నీటితో నిండుకుండ అలా ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రైతులకు సబ్సిడీలు, బోనస్ లు ఇచ్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం 1400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు కడియం శ్రీహరి కృషి ఆయన తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే కడియం శ్రీహరికి ప్రజలు అండగా ఉంటున్నారని ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల నరేందర్ వరలక్ష్మి, గాదే మహేందర్ రెడ్డి సర్పంచ్ కూటికంటి ఉపేంద్ర ,అనిల్, మహేష్ గౌడ్, జెట్టపోయిన సమ్మయ్య, సత్యనారాయణ,  గ్రామ రైతులు  తదితరులు పాల్గొన్నారు.