13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

బాధితులకు అండదండగా ప్రభుత్వం

13-05-2026 12:00 AM

బోయినపల్లి: మే 12 (విజయ క్రాంతి): బాధితులకు అండదండగా ప్రభుత్వం బాసర తెలుస్తుందని తాసిల్దార్ మొయినుద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మోయినోద్దీన్ మాట్లాడుతూ మండలం లో 57 మందికి 57 లక్షల ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు ,130 మందికి 35 లక్షల 54 వేల 2 వందలు సిఎం సహాయ నిధి చెక్కులను ,5 మంది కి రైతు బీమా చెక్కులను అందజేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు 287 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే వివిధ కారణాలతో చనిపోయిన ఐదుగురికి రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు చొప్పున చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొంది దరఖాస్తు చేసుకున్న పలువురికి సీఎం సహాయని చెక్కులను అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముందుగంటి సురేందర్ రెడ్డి, ఏ ఏం సి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సర్పంచ్ నల్లమోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు కొమ్మనబోయిన సువిన్ యాదవ్,సెస్ డైరెక్టర్ పుట్టేపల్లి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏవో ప్రణీత, ఆయా గ్రామాల సర్పంచులు, జిపిఓలు లబ్ధిదారులు ఉన్నారు.