7 April, 2026 | 10:59 AM

Breaking News

పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •   గడీల పాలన రానిచ్చేదిలేదు   •  

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

30-11-2025 06:27 PM

టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి..

ఉప్పల్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరామిరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రామంతపూర్ లో జర్నలిస్టులతో కలిసి  కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు కలగడం లేదన్నారు.

అక్రిడేషన్ కార్డుల విడుదలపై జాప్యం చేయడం తగదన్నారు. ఆరోగ్య స్కీం, ఇండ్లపట్టాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మధ్యతరగతి చెందిన కుటుంబాలకు చెందినవారే జర్నలిజంలో ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 3న చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్ కొలనుపాక చంద్రమౌళి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్ల మహేందర్రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సురేష్ ధూపాటి, వేముల తిరుపతిరెడ్డి, కె. నరోత్తం రెడ్డి, ఏం.అశోక్, యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్టాలిన్, నరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.