7 April, 2026 | 12:23 PM

300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

07-04-2026 10:51 AM

అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​ స్టేషన్​ సంఘటన

తెలంగాణ తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ కు తరలింపు

రూ. 12 చొప్పున కొనుగోలు చేసి.. అక్కడ రూ.20 చొప్పున అమ్మకం

అబ్దుల్లాపూర్​మెట్, ఏప్రిల్​ 07: నిరుపేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి డంప్ చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా వద్ద నుంచి 300 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ అలియాస్ బాబ్లు, మహమ్మద్ అమీర్ పాషా (30), హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో  రేషన్ బియ్యన్ని తక్కువ రేటుకు సుమారుగా 10 రూపాయల నుంచి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసి బియ్యన్ని ఆటోలలో నింపి, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలో రహస్య ప్రదేశంలో డంపు చేస్తుంటారు.

నిల్వ చేసిన బియ్యాన్ని ఛత్తీస్​గఢ్​, ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ రూ. 18 నుంచి  రూ. 20లకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే.. పక్క సమాచారంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రేషన్ బియ్యన్ని డంపు చేస్తున్న స్థలంపై దాడి నిర్వహించారు. ఈ ఘటన మొత్తం 510 సంచులలో సుమారుగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒకటి కంటెనర్ లారీ (టీఎస్​ - 02యూసీ -2829), కంటైనర్​ వాహనం,  (టీఎస్​ -12-యు -3751), అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ -12-టీ -3265), ముగ్గురు డ్రైవర్లు ఆడే రామ్ దాస్ (42), మీర్ ఫుర్కాన్ అలీ ఖాన్(32), జస్వంత్ రే(35) పట్టుకొని, స్వాధీనం చేసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అఖిల్ అలియాస్ బబ్లూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్ ఇన్​స్పెక్టర్​ వి. అశోక్​రెడ్డి తెలిపారు.