7 April, 2026 | 12:27 PM

మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం

07-04-2026 10:45 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్(Industrial Park Controversy) బాధిత రైతులను కలిసేందుకు హరీశ్ రావు పరిగి పర్యటనకు ప్లాన్ చేశారు. హరీశ్ రావు బయటకు రాకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 


ఈ నేపథ్యంలో హరీశ్ మీడియాతో(Harish Rao Press meet) మాట్లాడుతూ..... పరిగిలో జరిగేది భూసేకరణ కాదు, పేదవర్గాల భూములే లక్ష్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్క్ అంటూ పేదలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై(Revanth Reddy Government) విమర్శలు గుప్పించారు. పేద వర్గాల భూములపై ఎందుకు దండయాత్ర చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. పరిగిలో మరో దమనకాండ జరుగుతోందని చెప్పారు. మిమ్మల్ని అడ్డుకున్న.. రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. నాటి ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇచ్చారు.. ఇప్పుడు భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో పండ్ల మార్కెట్ కు రూ. 350 కోట్లు నిధులు కేటాయించామని వెల్లడించారు.