7 April, 2026 | 11:39 AM

Breaking News

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •  

కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!

07-04-2026 09:55 AM

పెద్దమనిషిగా చలామణి అవుతూ వేళలు పాటించని మద్యం దుకాణ యజమాని.

దాడులు జరిపిన ఎక్సైజ్ అధికారులు 15వేల పెనాల్టీ విధింపు. 

 నాగర్ కర్నూల్ (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ మద్యం దుకాణ వ్యాపారి పెద్దమనిషిగా చలామణి అవుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు. మద్యం కోసం వచ్చిన మద్యం ప్రియుల వద్ద కూడా దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నాడు. ఈనెల 5న ఆదివారం ఓ మద్యం ప్రియుడు చల్లటి బీర్ ఇవ్వాలని కోరిన కారణంగా ఇంతటి ఎండలో చల్లటి బీర్ ఎక్కడ దొరుకుతుంది అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ కాళీ సీసాతో దాడికి తెగబడ్డాడు.

దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పలు రకాల వత్తిల్ల కారణంగా తిరిగి కేస్ వాపస్ తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా తన ఇస్టారీతిగా మద్యం దుకాణాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తించిన కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి, ఎస్ఐ హనుమంతు నాయక్ సిబ్బందితో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టారు. మద్యం దుకాణంలో చాలావరకు ఆయా బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. వేళలు పాటించకుండా స్టాక్ మెయింటెనెన్స్ చేయని పక్షంలో షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. మొదటి తప్పుగా భావించి 15వేలు పెనాల్టీ విధించారు.