30 May, 2026 | 3:12 AM

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

30-05-2026 12:11 AM

ఉద్యోగుల బకాయిలు 2 వేల కోట్లు చెల్లింపు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో విడుదల

తొలి విడతగా విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్ర భుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యో గుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ఉద్యోగ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం తొలి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబం ధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యో గుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) బకాయిల మొత్తా న్ని వంద శాతం క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగు లకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయి లన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ముం దస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైంది.

ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4 వేల కోట్ల బకాయిల ను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చే యడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల పట్ల ప్రభు త్వం చూపుతున్న ఈ శ్రద్ధ, శరవేగ నిర్ణయాలపై ఉద్యోగ సం ఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.