6 August, 2026 | 2:30 AM

సాంకేతిక నైపుణ్యంతోనే భవిష్యత్తు

06-08-2026 12:00 AM

టీజీఆర్డీసీ చైర్మన్ రాంరెడ్డి

రంగారెడ్డి, అగస్టు 5(విజయక్రాంతి): మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టీజీఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం కర్మన్ఘాట్లోని శిల్పి గ్రాండ్లో తెలంగాణ ప్రై వేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన టెక్నికల్ సెమినార్కు ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో టెక్నీషియన్ల పాత్ర కీలకమని, పనుల్లో సురక్షిత ప్రమాణాలు పాటి స్తూ నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు.

లైసెన్సింగ్: అధికారిక పనులు, కాం ట్రాక్టులు దక్కించుకునేందుకు ప్రతి టెక్నీషియన్ వైర్మ్యాన్ లైసెన్స్ పొందాలని స్పష్టం చేశారు. విద్యుదాఘాతంతో మరణించిన కు టుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియాను రూ.8 లక్షలకు పెంచిందని తెలిపా రు.

ప్రైవేట్ టెక్నీషియన్ల సమస్యలను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ వర్కర్స్, కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు యాదగిరి, జీసీ రెడ్డి, కార్మిక సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.