12 July, 2026 | 5:38 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించాలి

06-01-2026 12:00 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): నీట్ పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో  నీట్ పరీక్షలు- 2026 నిర్వాహణ పై  సమన్వయ సమావేశం  డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై  విద్యాశాఖ  అధికారులకు పలు  సూచనలు, సలహాలు చేశారు.

ఈ పరీక్షకై జిల్లాలో 2 సెంటర్లు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ను  కేటాయించగా అందులో మొత్తం సుమారు 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని  తెలిపారు. మే -2026 సంవత్సరంలో నీట్ పరీక్షలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.