6 May, 2026 | 10:09 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ముగిసిన బుగ్గ జాతర.. పోటెత్తిన భక్తజనం

20-11-2025 10:07 PM

చివరి రోజు కావడంతో సుమారు 50వేల మందికి పైగా భక్తజనం..

ఇబ్రహీంపట్నం: ఆరుట్ల బుగ్గ జాతర గురువారం చివరి రోజు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వరుని జాతర శివనామ స్మరణతో మార్మోగింది. ఈ నెల 5 కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర నిన్న అమావాస్యతో ముగిసింది. 15 రోజుల పాటు జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన భక్తులు సత్యనారాయణ వ్రతాలు, పుణ్యస్నానాలు ఆచరించారు. శివలింగం, తులసికోట వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కబీర్‌దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహ్మబాబా సమాదిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వన భోజనాలతో ఆనందంగా గడిపారు.