1 March, 2026 | 8:42 AM

గుట్టలో అష్టోత్తర శతఘటాభిషేకం

01-03-2026 12:14 AM

ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు

స్వామివారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి        

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా శనివారం ఉదయం అష్టోత్తర శతఘాటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసిం హస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వా మివారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించు కున్నా రు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.