పచ్చని పల్లెపై ‘డంపింగ్’ పడగ
సిద్ధాపూర్లో కాలుష్య సెగ..
షాద్ నగర్ టౌన్, మే 31(విజయక్రాంతి ): ఒకప్పుడు సినీ నటుడు మహేష్ బాబు దత్తతతో ఆదర్శంగా నిలిచిన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో ని సిద్ధాపూర్ గ్రామంలో ఇప్పుడు డంపింగ్ యార్డ్ సెగలు రేపుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి 340 ఎకరాల ప్రభుత్వ భూమిలో ‘ఫుడ్ ప్రా సెసింగ్ యూనిట్లు’ ఏర్పాటు చేస్తామని రైతులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చింది.
దీంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని అందరూ ఆశపడ్డారు. కానీ ప్రభు త్వం మా రాక, జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఇ క్కడికి తరలించి ‘ఎకో టౌన్’ పేరుతో వర్మీ కంపోస్ట్, ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వార్తతో సిద్ధాపూర్ గ్రామంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్బీ పల్లి, కోడిచెర్ల, ఇన్ముల్ నర్వ గ్రామాలు, తండాల ప్రజలు ఒక్కసారిగా రోడ్డెక్కారు.
‘సేవ్ సిద్ధాపూర్’ అంటూ నిరసనలు..
డంపింగ్ యార్డ్ వస్తే భూగర్భ జలాలు విషతుల్యమై, పంటలు పండక ప్రాంతమం తా కరువు బారిన పడుతుందని, కాలుష్యం తో ప్రాణాంతక వ్యాధులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్తులకు మద్దతుగా అధికార,ప్రతిపక్ష పార్టీలు అంతా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నడుము కట్టారు.
మంత్రులకు వినతిపత్రాలు..
గ్రామస్తుల ‘ఊపిరి పోరాటానికి’ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే ఉ ప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులకు వినతి పత్రాలు అం దజేసి, ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్ సైతం తమ నేతలతో కలసి ఉద్యమానికి మద్దతు తెలిపారు.






