ప్రభుత్వ మరియు సింగరేణి స్థలాలను రక్షించండి
29 డివిజన్లో స్మశానం ముందు స్థల ఆక్రమణ ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలి
జలాల్ సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములు,సింగరేణి భూములు అనేకం ఆక్రమణకు గురవుతున్నాయని. సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ ఆరోపించారు. అధికారులు అనేకసార్లు స్థలాల వద్ద బోర్డులు పెట్టినప్పటికీ కాలా అనుగుణంగా ఆ బోర్డులు పడిపోవడం కావాలని పక్కన జరపడం చేస్తూ అనేక ఆక్రమణకు గురవుతున్నాయని ఆయనే అన్నారు. అక్కడక్కడ అధికారులు ఆక్రమణదారులపై చర్యలు చేపడుతున్నప్పటికీ అవి నామమాత్రం గానే కనబడుతున్నాయని. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురవుతాయి రేపు భవిష్యత్తు అవసరాల కోసం తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం అన్నారు. 29వ డివిజన్లో హిందూ స్మశాన వాటిక ముందు ఉన్న స్థలం పై జరుగుతున్న వివాదం అధికారులు సమగ్ర విచారణ జరిపించి దాని పరిస్థితి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ స్థలాలకు పేదల పేరుతో కొంతమంది బినామీదారులు దొంగ ఇంటి నెంబర్లు పెడుతూ ముందు ఒకరిని పెట్టి వెనక నుండి రాజకీయం చేస్తూ ఆ స్థలాలను తర్వాత అమ్మకానికి పెడుతున్నారని ఇది నిత్యం కొత్తగూడెంలో అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే అన్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ ,సింగరేణి స్థలాల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించాలని ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై నాన్ బేలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు






