ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బచ్చన్నపేట, మార్చి 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలోనిపాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనలో నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
అలాగే మధ్యాహ్నం భోజనం విషయంలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ మమత, ఎంపీఓ శ్రీనాథ్ రెడ్డి, సర్పంచులు అల్వాల నర్సింగరావు, బేదాడి సిద్ధులు పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, సౌజన్య పాల్గొన్నారు.




