23 June, 2026 | 2:46 AM

ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది

23-06-2026 12:00 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవా లక్ష్యాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు, నూతన మండల కార్యాలయం పార్టీ కార్యకర్తలకు ఒక బలమైన వేదికగా, ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మదన్మోహన్ రావు  మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు, రాష్ట్రంలో ప్రజా పాలనను మరింత బలోపేతం చేయడంలో పార్టీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాలభైరవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చింతల శంకర్, మండల పార్టీ నాయకులు రంగు రవీందర్ గౌడ్, లక్ష్మా గౌడ్, స్వామి, శంకర్, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.