23 June, 2026 | 2:46 AM

యూరియా యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ..నేడు తాడ్వాయిలో మహా ధర్నా

23-06-2026 12:00 AM

తాడ్వాయి, జూన్, 22 (విజయ క్రాంతి): ప్రభుత్వం యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తాడువాయి మండల కేంద్రంలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముదాం నరసింహులు తెలిపారు.కామారెడ్డి జిల్లా తారవాయి మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సోమవారం మాట్లాడుతూ.... రైతులకు ఎంతో ఇబ్బందులు పెడుతున్న యూరియా యాప్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందుకోసం ప్రభుత్వం దిగి వచ్చేలా పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ లు పాల్గొంటారని తెలిపారు. మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు  ఈ కార్యక్రమంలో తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, మైపాల్ రెడ్డి,  పీసు రాజిరెడ్డి, మంగారెడ్డి, తాటిపాముల రాజు గౌడ్, గోపాల్ రావు, భాస్కర్ రెడ్డి, గంగారం  పాల్గొన్నారు.