17 August, 2026 | 5:18 PM

ప్రజావాణి కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

17-08-2026 04:21 PM

రుద్రంగి ఆగష్టు 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి తాసిల్దార్ పుష్పలత, ప్రజావాణి కన్వీనర్ ఎంపిఓ రాజేశ్వర్ కోరారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వము మండల ప్రజల సౌకర్యం కోసం మండల స్థాయిలోనే  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ఉంటారని ప్రజలు మీ సమస్యలపై దరఖాస్తు ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.