17 August, 2026 | 7:18 PM

కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

17-08-2026 05:11 PM

దరుగుల రాకేష్ సీనియర్ నాయకుడు

హుజురాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కల్యాణ లక్ష్మి పథకాన్ని నిరుగార్చే కుట్రలు ప్రభుత్వం పన్నుతుందని ఇల్లంతకుంట మండలం మాజీ ఎంపిటిసి దరుగుల రాకేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో తాసిల్దార్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ వ్యాప్తంగా సోమవారం నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. కెసిఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భృన హత్యలు, గర్భస్థ ఆడశిశువుల హత్యలు, బాల్య వివాహలు చూసి చలించి పరిష్కారం గా కెసిఆర్  ముఖ్యమంత్రి అయ్యాక కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రారంభించినారు అని, నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ళకి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసిన విషయం గుర్తు్చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా సుమారు 17లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళకి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ధ్వారా లబ్ది జరిగింది అని, ఇటీవల హై కోర్ట్ లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంకి ప్రభుత్వం కౌంటర్ దాకలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఫలితమే హై కోర్ట్ స్టే ఇచ్చినదని దుయ్య బట్టరు. ప్రభుత్వం బే షరతుగా ఈ పధకాలని కొనసాగించాలి అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమాల్లో వివిధ మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.