సామాన్యుడి భావోద్వేగాల ‘ఆత్మకథ’
వారాహి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సోమేశ్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ఆత్మకథ: యాన్ అన్‌టోల్డ్ స్టోరీ’. ఇందులో జెమిని సురేశ్ హీరోగా, రూప హీరోయిన్‌గా నటించారు. 30 ఇయర్స్ పృథ్వీ, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేశ్, ధనరాజ్, నాగ మహేశ్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్, ట్రైలర్ లాంచ్ చేశారు. పలువరు సినీరంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెమిని సురేశ్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా అనేది ఇంట్లో వేడి అన్నంలో తినే పప్పు, ఆవకాయ, నెయ్యి లాంటిది.
సామాన్యుడి భావోద్వేగాలు, భయం, వినోదంతో కూడిన అద్భుత కుటుంబ కథా చిత్రమిది” అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాకు డబ్బింగ్ తప్పించి మిగతా అన్ని పనులు ఇంట్లోనే చేసుకుంటా. ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా” అన్నారు. నటి కరాటే కళ్యాణి, నటుడు కుమనన్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






