11 April, 2026 | 11:53 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

ప్రభుత్వం వైఖరి మారాలి...!

09-10-2025 04:52 PM

బీఆర్ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్..

అమీన్ పూర్: రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచిన నేపథ్యంలో ప్రజల తరఫున బలమైన నిరసన తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమానికి బయలుదేరిన సమయంలో పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ని పోలీసులు అన్యాయంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవైపు ఫ్రీ బస్ ప్రయాణం అని చెబుతూ మరోవైపు చార్జీలు పెంచడం ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భారమని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉంది అని ఐలాపూర్ మాణిక్ యాదవ్  అన్నారు. ఈ హక్కును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని ప్రదర్శించిందని ఆయన తెలిపారు. ప్రజల హక్కులను తుంగలో తొక్కుతూ నిరసనలు అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి పెంపులు, అరెస్టులు చేస్తోందని బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.