20 April, 2026 | 3:45 AM

టీజీఆర్టీసీ సమ్మె.. రైట్ రైట్

20-04-2026 12:22 AM

22న సమ్మెకు సంసిద్ధం సంఘాలు

పాల్గొనున్న 3200 మంది ఉద్యోగులు కార్మికులు 

సంస్థ పరిరక్షణ కోసమేనని కార్మిక సంఘాల వెల్లడి 

నిర్మల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రయాణికుల సేవ.. ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ మరింత కష్టాల్లో పడనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు టీజీ ఆర్టీసీ కార్మికుల  జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు.

ఇప్పటికి సమ్మె నోటీసులు ఆర్టీసీ యాజమాన్యానికి అందించిన కార్మిక సంఘాలు అన్ని డిపోల్లో సమ్మెకు కార్మికులను ఉద్యోగులను సన్నద్ధం చేశారు. ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్రం మద్దూర్ యూనియన్, తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్, ఆర్టీసీ పరిరక్షణ సంఘం, ఎస్ డబ్ల్యూ ఎఫ్ తదితర 7 సంఘాల ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ భైంసా ఉట్నూర్ ఆస్ఫాబాద్ మంచిర్యాల్ డిపోలు ఉండగా మొత్తం 3300 మంది వరకు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ రీజినల్ పరిధిలో ఆరు డిపోలు ఉండగా సుమారు 630 బస్సులు ప్రతిరోజు రెండు లక్షల 80 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి 

సమ్మెకు కార్మికులు సంసిద్ధం.. 

టీజీ ఆర్టీసీ పరిరక్షణ లక్ష్యంగా ప్రధాన డిమాండ్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర రామచంద్ర రెడ్డి, రాష్ట్ర జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, ఉమ్మడి జిల్లా నాయకులు గంగాధర్ పోశెట్టి రమేష్ తదితర నేతలంతా ఆయా డిపోల్లో 22 నుంచి సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని గేట్ మీటింగులు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగకపోవడంతో ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. సమ్మె నివారణకు ప్రభుత్వం టీజీ ఆర్టీసీ నేతలతో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇప్పటికీ అనేకసార్లు ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసినందుకు కుట్ర పన్నడమే కాకుండా కార్మికుల భద్రతపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు.

10 ఏళ్లుగా ఆర్టీసీ కష్టనష్టాలకు గురికావడానికి ఆర్టీసీ అధికారులు అనుసరిస్తున్న విధానంతో పాటు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించవలసిన బకాయిల విషయంలో మొండిపట్టు పట్టడం వల్లనే ఆర్టీసీకి నష్టం జరుగుతుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కెసిఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీ పరిరక్షణకు కనీస చర్యలు చేపట్టడం లేదని దీంతో ఆర్టీసీ సంరక్షణ బాధ్యత ఇక ఆర్టీసీ కార్మికులదేనని స్పష్టం చేస్తూ ఈ సమ్మె చేస్తున్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

ప్రధాన డిమాండ్లు ఇవే.. 

టీజీ ఆర్టీసీ ఈనెల 22 నుండి సమ్మె చేయడానికి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వంలో టీజీ ఆర్టీసీని విలీనం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు.

ఆర్టీసీ కార్మికులకు 2017 నుంచి చెల్లించవలసిన ఏరియాస్ చెల్లించాలన్నారు. ఇప్పటివరకు రెండు సార్లు పిఆర్సి అమలు చేయవలసి ఉన్న ప్రభు త్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కారుణ్య నియామకం చేపట్టిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. టీజీ ఆర్టీసీలో ప్రతి ఏటా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించుకుని బడ్జెట్ లు ప్రతినెల చెల్లించాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇతర ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలి.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపును కొనసాగించాలని కోరుతున్నారు. ఇటువంటి డిమాండ్ల సాధన కోసం టీజీ ఆర్టీ సీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం టీజీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేస్తామని ప్రకటించగా అది తీర్మాన సమయంలో రద్దు అయ్యింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనంపై ప్రకటించారు. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవ త్సరాలు దాటిన ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోగా సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో సమ్మె తప్పనిసరి చేయవలసి వస్తుందని కార్మికులు చెప్తున్నారు. 

సంస్థ పరిరక్షణ కోసమే 

టీజీ ఆర్టీసీ పరిరక్షణ కోసమే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏ సీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం. గత పది సంవత్సరాల నుంచి టీజీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థ పరిరక్షణకు వచ్చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు ఏ ఒక్క ఆమె కూడా నెరవేర్చ కుండా చర్చల పేరు తో ఆలయాపన చేస్తున్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి ఆర్టీసీ కార్మికులందరినీ ఈ నెల 22 నుంచి సమ్మె చేసే విధంగా సం సిద్ధం చేసిన. ప్రభుత్వ ఆలు ఇస్తే సరిపోదు . సంబంధించిన చర్యలు ప్రారంభించాలి.  

 ఎర్ర రామచంద్ర రెడ్డి, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు 

తగిన గుర్తింపు లేదు

పేరుకి ఆర్టిసి ఉద్యోగం. మాకు చెల్లించేది తక్కువ జీతాలే. ఏళ్ల తరబడి పని చేసిన మాకు తగిన గుర్తింపు లేదు. ఆర్టీసీ కార్మికులను గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి సంస్థ పరిరక్షణకు  కృషి చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించింది. హామీ హామీగానే మిగిలిపోయింది. తక్కు వ వేతనాలు పెరిగిన ఖర్చులు మా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకా లంలో అందడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణ స్పందించి సంస్థ పరిరక్షణకు కృషి చేయాలి.

గంగాధర్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి 

ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నాం.. 

టీజీ ఆర్టీసీ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లు ఇప్పటివి కావు. పది సంవత్సరాలుగా కార్మిక సంఘాలు ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయాలని సంస్థ పరిరక్షణకు బడ్జెట్ కేటాయించాలని కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న. అయినా ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోకపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునిచ్చాం.

రమేష్, ఎస్‌డబ్ల్యూఎఫ్