హైకోర్టు డివిజన్ బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 17: గ్రూప్ అంశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ బుధవారం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిం ది. గ్రూప్- మెయిన్స్ పరీక్షా ఫలితాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం, ఈ నెల 9వ తేదీన మెయిన్స్ ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ తీర్పులో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్‌గా రీవాల్యుయేషన్ చేయాలని, లేదా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన మార్గ దర్శకాల ప్రకారం సాధారణ పద్దతిలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా కొత్త మెరిట్ జాబితాను విడుదల చేయాలని, ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే, ఎనిమిది నెలల్లోగా మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తుది జాబితాలో స్థానం సంపాదించిన అభ్యర్థులు రివ్యూ పిటిషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ మొదటికి..
గ్రూప్ అంశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు అనంతరం జరుగుతున్న పరిణామాలు, రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తమను బాధిస్తున్నాయని, కష్టపడి చదివిన తమ జీవితాలను రాజకీయం చేయవద్దని తుది జాబితా అభ్యర్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడు తూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి, కోర్టు తీర్పు కారణంగా నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది, త్వరలో ఉద్యోగాలు వస్తాయనుకున్న అభ్యర్థులకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది, 563 పోస్టుల భర్తీ ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది.






