25 April, 2026 | 9:55 PM

ధాన్యం కొనుగోలు హామీతో రైతుల నిరాహార దీక్ష విరమణ

25-04-2026 08:19 PM

దీక్ష విరమింపజేసిన ఎమ్మార్వో బ్రహ్మేశ్వర రావు

ఎనిమిదో వార్డు కౌన్సిలర్ డాక్టర్ లక్కినేని రఘు

కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల పరిధిలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి గోకవరం గ్రామ సర్పంచ్ గుగులోతు శీను ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష రెండు రోజుల తర్వాత ముగిసింది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కల్లూరు ఎమ్మార్వో బ్రహ్మేశ్వరరావు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మార్వో బ్రహ్మేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ హామీపై సంతృప్తి చెందిన సర్పంచ్ గుగులోతు శీను నిరాహార దీక్షను విరమించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ 8వ వార్డ్ కౌన్సిలర్ లక్కినేని రఘు,బిఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి బానోత్ కృష్ణ,ఉప సర్పంచ్,కొర్లగూడెం సొసైటీ సీఈఓతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.