16 June, 2026 | 11:48 AM

కవిత "సింగరేణి బాయిబాట" కార్యక్రమంలో ఉద్రిక్తత

16-06-2026 10:07 AM

శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా(Mancherial District) శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని వద్ద ఉద్రిక్తత నెలకొంది. "సింగరేణి బాయిబాట"లో( Singareni Baayi Bata program) భాగంగా  శ్రీరాంపూర్ సింగరేణి వర్క్ షాప్  తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత సందర్శించారు. భూగర్భ గని వద్ద బొగ్గుబాయి కార్యక్రమంలో ఆర్కే-7 గని వద్ద గేట్ మీటింగ్ కు టీఆర్ఎస్ వర్గాలు ఏర్పాటు చేశాయి. కవిత, టీఆర్ఎస్ శ్రేణులను గనిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆర్ కే-7 గని వద్ద గేట్లను తోసుకుని కవిత లోనికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కవిత, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా యాజమాన్యం, ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనుల్లో కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, కనీసం తాగునీరు కూడా అందించడం లేదని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా గనుల్లో కార్మికుల భద్రత, వెంటిలేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే, సింగరేణిలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత గాలి కూడా అందించలేని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలని కవిత ఫైర్ అయ్యారు.